ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ విభాగంలో ఈ రోజు (16 జూలై 2024) “మీడియా మరియు అంతర్జాతీయ సంబంధాలు” అనే అంశంపై అతిథి ఉపన్యాసం జరిగింది.
E.F.L.U. కమ్యూనికేషన్ శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎ. నాగరాజు ఉపన్యాసం ఇచ్చారు. అంతర్జాతీయ సంబంధాలలో పశ్చిమ దేశాల యొక్క గత మరియు ప్రస్తుత పాత్రను వివరించారు.
విదేశాంగ విధానం యొక్క మొదటి ప్రాధాన్యత ఒకరి స్వప్రయోజనాలేనని తెలిపారు. “రియలిజం”, “లిబరలిజం”, “కన్స్ట్రక్టివిజం” వంటి దృక్కోణాలు, వాటి వాస్తవ ప్రపంచ ప్రభావాలు వివరించారు.
ఆధునిక మీడియా తన ఎజెండా సెట్టింగ్ మరియు ప్రచారం ద్వారా అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ దృక్పథాన్ని ప్రభావితం చేసిందని తెలిపారు.
మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలోఉపన్యాసానికి హాజరయ్యారు మరియు ఇంటరాక్టివ్ సెషన్లో పలు ప్రశ్నలు లేవనెత్తారు.