The new criminal laws have put journalistic freedom in peril as some sections of the law allow wide scope for interpretation, said a senior advocate of the Supreme Court.
Delivering a guest lecture at the Department of Journalism & Mass Communication on Wednesday (30th July 2024), Mr. Shams Khwaja said the wording of some laws in the Bharatiya Nyaya Sanhita (BNS) places the official ‘perception’ on a higher plane compared to facts reported by journalists.
“The Indian Penal Code had a provision in Section 93 which said a communication made in good faith and in public interest was not an offence. But if journalistic version differs from the official version, the new laws can punish journalists,” he said.
Mr. Khwaja cited instances of the British-era Salt Act and the Jallianwala Bagh massacre to say the law can make reasonable actions unlawful. In his view, some provisions of BNS, such as Section 145 of chapter 7 dealing with waging war against the state, also carried the same dynamic.
“Journalists should regard the law and abide by it to the extent that their professional duties allow them to. The courts should see journalistic freedom as having wider scope than what applies to citizens in general,” he said.
* * *
‘కొత్త క్రిమినల్ చట్టాలతో మీడియా స్వేచ్ఛకు ఆపద’
కొత్త క్రిమినల్ చట్టాల్లో కొన్ని సెక్షన్లు వ్యాఖ్యానానికి విస్తృత పరిధి అనుమతిస్తూ పాత్రికేయ స్వేచ్ఛను ప్రమాదంలో పడేశాయి అని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది షమ్స్ ఖ్వాజా అన్నారు.
బుధవారం జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ విభాగంలో అతిథి ఉపన్యాసం ఇస్తూ, భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కొన్ని చట్టాలు జర్నలిస్టులు నివేదించిన వాస్తవాలతో పోలిస్తే అధికారిక ‘అవగాహన’కు ఎక్కువ విలువనిస్తాయి అని తెలిపారు.
“భారత శిక్షాస్మృతి సెక్షన్ 93 నిబంధనల ప్రకారం చిత్తశుద్ధి మరియు ప్రజా ప్రయోజనాల కోసం చేసిన కమ్యూనికేషన్ నేరం కాదు. అయితే మీడియా కథనం అధికారిక వెర్షన్‌కు భిన్నంగా ఉంటే, కొత్త చట్టాలు జర్నలిస్టులను శిక్షించగలవు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
బ్రిటీష్ కాలం నాటి ఉప్పు చట్టం మరియు జలియన్ వాలాబాగ్ ఊచకోత సంఘ్లటనలను ఉటంకిస్తూ చట్టం సహేతుకమైన చర్యలను చట్టవిరుద్ధం చేయగలదు అని చెప్పారు. బీ ఎన్ ఎస్ లోని అధ్యాయం 7 సెక్షన్ 145లో కూడా రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం గురించిన నిబంధనలు అటువంటి గతిశీలతను కలిగి ఉన్నాయి అని అన్నారు.
“జర్నలిస్టులు తమ వృత్తిపరమైన విధులను అనుమతించే మేరకు చట్టాన్ని గౌరవించాలి మరియు దానికి కట్టుబడి ఉండాలి. న్యాయస్థానాలు కుడా పాత్రికేయ స్వేచ్ఛను సాధారణంగా పౌరులకు వర్తించే దానికంటే విస్తృత పరిధిని ఆపాదించాలి” అని ఆయన అన్నారు.
* * *