Beating the anti-incumbency factor in Bihar, Chief Minister Nitish Kumar led the National Democratic Alliance (NDA) to a huge win in the State Assembly election on Friday, with the ruling coalition’s seat tally crossing 200 in the 243-strong legislature. Mr. Kumar’s Mahila Rojgar Yojana, under which ₹10,000 was given to around 1.25 crore women over the last two months, seemed to have played an important role in his victory. — The Hindu
The Bharatiya Janata Party-led National Democratic Alliance registered a resounding victory in the Bihar assembly elections, results of which were announced on Friday, exceeding expectations the ruling alliance with all constituent parties improving their tally from the last polls even as the Congress-led opposition INDIA bloc slumped to its worst ever defeat in the state. — Hindustan Times
National Democratic Alliance (NDA) won a stunning landslide in Bihar, with the governing coalition headed by chief minister Nitish Kumar bagging 202 of 243 assembly seats in a hugely one-sided outcome that underscores the JDU boss’ political resilience despite two decades in office, and PM Narendra Modi’s sway with voters , while deflating the Grand Alliance’s Rahul Gandhi-led campaign against “vote theft”. — The Times of India
In a historic and decisive mandate paving the way for Nitish Kumar’s tenth term as Chief Minister, Bihar returned the ruling NDA to power in a landslide Friday in the Assembly elections, decimating the Opposition Mahagathbandhan and strengthening the hands of the BJP at the Centre ahead of electoral battles in some key states going to polls next year. — Indian Express
The ruling National Democratic Alliance (NDA) scored a victory for ages in the Bihar Assembly election on Friday, securing a commanding three-fourths majority. While the NDA bagged 202 seats in the 243-member assembly, the RJD-Congress combine was not even close, garnering a meagre 35 seats. The drubbing pushed the alliance to the periphery of Bihar political landscape. The BJP emerged as the single-largest party with 89 seats, while the JD(U) won 85, LJP(RV) 19, HAM 5 and RLM 4. — The New Indian Express
On a day when India dominated South Africa in the Kolkata Test, the National Democratic Alliance (NDA) delivered its own emphatic performance in Bihar, sweeping the Assembly elections with a three-fourths majority — Financial Express
It was a stunning victory for the ruling National Democratic Alliance (NDA) in Bihar that Prime Minister Narendra Modi dubbed as a sign of things to come in the elections ahead in West Bengal, Tamil Nadu and Kerala. Till 9 pm, as the votes were still being counted, the NDA was set to win 202 seats in the 243-member Bihar Assembly, that is a staggering 83 per cent of the total seats. — Business Line
The National Democratic Alliance (NDA) is set to return to power in Bihar with an even bigger majority than last time, sparking celebrations among party cadres in the state. Nitish Kumar, the state’s longest-serving chief minister, is likely to return at the helm. — Mint
The Bharatiya Janata Party (BJP) became the single largest party in a Bihar Assembly election for the first time, as it led the National Democratic Alliance (NDA) to a landslide win in results declared on Friday. The performance follows the party’s setback in the 2024 Lok Sabha polls, when it fell short of a simple majority. — Business Standard
“As the Bihar Assembly results rolled in Friday, it was clear the state was hit by a full-blown Nitish storm that tore through every obstacle in its path. JD(U) posters plastered across the state declared “Tiger abhi zinda hain”, sending the message loud and clear: Nitish Kumar was back, stronger than ever. — Deccan Chronicle
The ruling National Democratic Alliance (NDA) decimated both the opposition Mahagathbandhan and the newly floated Jan Suraaj in the Bihar Assembly elections, securing a three-fourths majority in the 243-member House in a verdict that reaffirmed Prime Minister Narendra Modi’s popularity and Chief Minister Nitish Kumar’s enduring appeal. — The Tribune
The ruling NDA decimated the Mahagathbandhan in Bihar on Friday to retain power reaffirming Prime Minister Narendra Modi’s popularity and Chief Minister Nitish Kumar’s enduring appeal and dealing a body blow to the Congress and ally RJD. — The Hans India
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు దుమ్మురేపింది. మోదీ, నితీశ్ కుమార్ జోడీ అద్బుతం చేసింది. ఎన్నికల్లో ఆరింట ఐదొంతుల సీట్లను సాధించి విజయ దుందుభి మోగించింది! రాష్ట్ర అసెంబ్లీలో 243 స్థానాలుంటే ఎన్డీయే 202 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక్కడ బీజేపీ ఏకంగా 88 శాతం స్ట్రైక్ రేట్‌ను సాధించింది! ఆ పార్టీ 101 సీట్లలో పోటీ చేసి ఏకంగా 89 స్థానాల్లో విజయం సాధిస్తే.. పవన్ కల్యాణ్ తరహాలోనే బిహార్లో చిరాగ్ పాసవాన్ ఫీనిక్స్ పక్షిలా ఎదిగి.. 68ు స్ట్రైక్ రేట్‌ను సాధించారు! గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన ఆయన.. ఈసారి 28 సీట్లలో పోటీ చేసి 19 స్థానాల్లో తన పార్టీని గెలిపించారు. ఇక, సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా 101 సీట్లలో పోటీ చేసి 85 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకుంది. ప్రధాని మోదీ చరిష్మా, సుశాసన్‌బాబుగా నితీశ్‌కుమార్‌కు ఉన్న పేరు, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి అనే నినాదాలు కూటమికి ఘన విజయం కట్టబెట్టాయి. బిహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి తుడిచిపెట్టుకుపోయింది! గత అసెంబ్లీ ఎన్నికల్లో 110 సీట్లు సాధించిన ఆ కూటమి ఈసారి అందులో మూడోవంతు(35)కే పరిమితమైంది! శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్లు.. మోదీ, జగన్, మమత, స్టాలిన్ తదితరులను గెలిపించానని చెప్పుకొన్న ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు సొంత రాష్ట్రం బిహార్లో పని చేయలేదు! జన సురాజ్ పేరిట పార్టీ పెట్టి.. పాదయాత్ర చేసి.. ఎన్నికల బరిలోకి దిగిన ఆయనను బిహారీలు ఏమాత్రం పట్టించుకోలేదు! ఆయన పార్టీ అభ్యర్థులు సోదిలో కూడా లేకపోవడమే ఇందుకు నిదర్శనం! వెరసి, అసెంబ్లీ ఎన్నికల్లో బిహారీలు ఎన్డీయేకు పట్టం కట్టారు. — ఆంధ్ర జ్యోతి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం సృష్టించింది. నీతీశ్, మోదీల జోడీ సూపర్‌హిట్ కొట్టింది. ఆ కూటమే ఊహించనంతగా.. ఎగ్జిట్ పోల్స్‌కూ అందనంతగా అప్రతిహత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లతో అందనంత ఎత్తున నిలిచింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ చావుదెబ్బ తింది. కేవలం 34 సీట్లతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా ప్రతిపక్ష హోదాకు అర్హత సాధించగలిగింది. ఇక సంచలనం సృష్టిస్తానని మొత్తం 243 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిశోర్ పార్టీ జన్ సురాజ్ అసలు ఖాతానే తెరవలేదు. గతంలో మాదిరిగానే ఎంఐఎం మళ్లీ 5 చోట్ల గెలిచి పట్టు నిలబెట్టుకుంది. సమన్వయం, అభివృద్ధి హామీలు, మహిళలకు నగదు బదిలీవంటి వాటితో ఎన్డీయే అద్భుత ఫలితాలను సాధించగా.. అంతర్గత కలహాలు, సీట్ల సర్దుబాటులో అయోమయం, నేతల మధ్య సమన్వయ లోపంవల్ల విపక్ష కూటమి చతికిలపడింది. లోక్‌సభ ఎన్నికల్లో కొంత వెనుకంజ తర్వాత హరియాణా, మహారాష్ట్ర, దిల్లీల్లో ప్రభంజనం.. తాజాగా బిహార్‌లో ఘన విజయం ఎన్డీయేకు సరికొత్త ఉత్సాహాన్నిచ్చినట్లయింది. — ఈనాడు
బిహార్ శాసనసభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే సీట్ల సునామీ సృష్టించింది. మొత్తం 243 స్థానాలకు గాను ఏకంగా 202 స్థానాలు దక్కించుకొని డబుల్ సెంచరీ కొట్టేసింది. తమకు ఎదురే లేదని నిరూపించుకుంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో మొదటి నుంచీ చివరిదాకా బీజేపీ–జేడీ(యూ) కూటమి ప్రభంజనమే కనిపించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాకర్షణ శక్తి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అందించిన సుపరిపాలన కూటమి విజయానికి బాటలు వేశాయి. — సాక్షి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలో మరోసారి ‘నిమో(నితీశ్–మోదీ)’ హవాతో అధికార కూటమి ఘన విజయం సాధించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసినట్టే.. బిహార్ ఓటర్లు ఎన్డీయేకు బంపర్ మెజార్టీతో మరోసారి అధికారాన్ని అప్పగించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఏకంగా 202 సీట్లను కట్టబెట్టారు. మొత్తం 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీకి ఈ నెల 6, 11న రెండు విడతల్లో పోలింగ్ జరగగా.. శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టిన ఎన్నికల సంఘం(ఈసీ) ఫలితాలను ప్రకటించింది. — వెలుగు
యావత్ దేశం ఆసక్తికనబరిచిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) కూటమి ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్‌బంధన్ (Mahagathbandhan) కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్‌లో నితీశ్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డేయే ఇప్పటికే 202 స్థానాల్లో గెలుపొందింది.. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మహాఘట్‌బంధన్ బలపరిచిన సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) విజయం సాధించారు. కానీ, ఆయనకు అధికారం మరోసారి కలగానే మిగిలింది. ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయనేతగా రాణించాలనుకున్న ప్రశాంత్ కిశోర్‌ను ఓటర్లు తిరస్కరించారు. ఇక చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. — నమస్తే తెలంగాణ
















