విద్యార్థి జీవితాలకు అద్దం
పుస్తకం: అంపశయ్య (నవల)
రచయిత: నవీన్
సమీక్ష: తిర్మాన్ పల్లి ప్రతీప్
అంపశయ్య బుక్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి జీవితం గురించి, తనలోని ఆలోచనలు, మానసిక స్థితి, సమాజంపై తనకున్న అభిప్రాయం గురించి తెలియజేస్తుంది.
సమాజంలోని అసమానతలు, మానసిక స్థితి గురించి రాయడం రచయిత ప్రత్యేకత. విద్యార్థులు, మధ్యతరగతి జీవితాలను సహజంగా రాశారు.

ఈ నవలలో రవి ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. ఆయన యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచనలు, అనుభవాలు ప్రస్తుత యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటాయి.
స్టూడెంట్ లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదు… భవిష్యత్తుపై భయం, కుటుంబ పరిస్థితులు, ప్రేమ, స్నేహితులు, సమాజం అనే అంశాల గురించి కూడా ఆలోచనలు ఉంటాయి. కాని వాటిని అర్థం చేసుకుని ముందుకు సాగాలని చెప్పేదే ఈ కథ. కాని కథలోని పాత్ర ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల కష్టంగా అనిపించవచ్చు.
స్టూడెంట్ లైఫ్ని అర్థం చేసుకోడానికి ఈ బుక్ బాగుంటుంది. చదువు అంటే పుస్తకాల్లోని విషయాలను నేర్చుకోవడం మాత్రమే కాదని, మనిషి జీవితాన్ని, సమాజాన్ని అర్థం చేసుకోవడం కూడా అని ఈ కథ ఆలోచింపజేస్తుంది.